తిరుమలలో హృదయ విదారకర ఘటన! వారికి మనసెలా ఒప్పిందో!!


Posted August 19, 2018 by Ramesh476

తిరుమల క్షేత్రంలో శనివారం రాత్రి హృదయ విదారకర సంఘటన చోటు చేసుకుంది. సుమారు పదిరోజుల పసి కందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు.

 
తిరుమల క్షేత్రంలో శనివారం రాత్రి హృదయ విదారకర సంఘటన చోటు చేసుకుంది. సుమారు పదిరోజుల పసి కందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. రాత్రి 8 గంటల సమయంలో కల్యాణకట్ట ఎదురుగా ఉన్న షెడ్‌లో చిన్నారి ఏడుపు విన్నా పారిశుధ్య కార్మికులు, విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న విజిలెన్స్‌ సిబ్బంది చిన్నారిని ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని హెల్త్‌ డిస్పెన్సరీకి తరలించారు. పాప ఆరోగ్యంగానే ఉందని తెలియటంతో ఆ తర్వాత స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, ఆ చిట్టి తల్లిని ఎవ్వరు వదిలిపెట్టి వెళ్లారనే దానిపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. దీనిలో భాగంగా పరిసర ప్రాంతాల్లోని సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
--- END ---
Contact Email [email protected]
Issued By Mana Telangana
Website http://manatelangana.news
Country India
Categories Baby , News
Tags andhra pradesh , new born baby girl , tirumala
Last Updated August 19, 2018